మహేశ్‌బాబు అంటే నాకు క్రష్
‘మహేశ్‌బాబు(Mahesh Babu) చాలా హ్యాండ్సమ్. ఆయన చాలా అందంగా ఉంటారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. మహేశ్‌బాబు(Mahesh Babu) అంటే నాకు క్రష్. ఆయన సినిమాలో నటించే అవకాశం వస్తే ఎలాంటి పాత్ర చేయడానికైనా నేను సిద్ధమే. చివరకు విలన్ పాత్ర ఇచ్చినా చేస్తాను. సినిమాలో ఆయన్ని విలన్‌గా చూస్తూ కోపంగా చూడాల్సిన సన్నివేశాలు ఉంటే మాత్రం నాకు కొంచెం కష్టమే. ఎందుకంటే ఆయన్ని కోపంగా చూడాల్సిన చోట కూడా రొమాంటిక్‌గా చూస్తానేమో! ఆయన నా ఎదురుగా నిలబడి నా వైపు చూస్తుంటే అసలు నటించడమే మర్చిపోతానేమో.
డైలాగులు కూడా మర్చిపోయే అవకాశం ఉంది’ అంటూ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సరదాగా వ్యాఖ్యానించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ.. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు గురించి తన మనసులోని మాటను బయటపెట్టింది. ఆయన అందం, హ్యాండ్సమ్ లుక్ గురించి ప్రశంసించింది. మహేశ్‌బాబు సినిమాలో విలన్‌గా నటించే అవకాశం వచ్చినా అంగీకరిస్తానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన ఎదురుగా ఉంటే నటన కూడా మర్చిపోతానేమోనని అనుపమ చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.