పాగా కోసం కాషాయం పూర్వ వైభవం కోసం గులాబీ

23-11-2026 | 05:15am
  1. నేడు జేజేపీ పాదయాత్ర.. జాతీయ అధ్యక్షుని రాక
  2. 29న బీఆర్‌ఎస్ దీక్షా దివస్.. కేటీఆర్ రాక్ 

నవంబర్ 22 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా రాజకీయాలు(Politics of Karimnagar District) ప్రస్తుతం బిఆర్‌ఎస్, బిజెపి మధ్య హోరాహోరీ కార్యక్రమాలతో వేడెక్కాయి. గత అసెంబ్లీ ఎన్నికల అనంతర పరిణామాలు, ఇటీవల ముగిసిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి సాధించిన విజయాలు, రాబోయే రా జకీయ సమీకరణాల నేపథ్యంలో ఇరు పార్టీలు కరీంనగర్ను తమ ప్రధాన వేదికగా ఎంచుకున్నాయి. తమ పూర్వ వైభవా న్ని చాటుకోవడానికి బిఆర్‌ఎస్ వ్యూహాలు రచిస్తుండగా, జి ల్లాపై పట్టు సాధించి పాగా వేయడమే లక్ష్యంగా బిజెపి భారీ కార్యక్రమాలకు సిద్ధమైంది.

పూర్వ వైభవం కోసం బీఆర్‌ఎస్ ఆరాటం 

తెలంగాణలో తిరిగి రాజకీయ ఊపును అందుకోవడానికి బిఆర్‌ఎస్ పార్టీ 29న నిర్వహించనున్న ‘దీక్షా దివస్‘ కార్యక్రమం ద్వారా కరీంనగర్ నుండి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు బిఆర్‌ఎస్ యోచిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర లేదా బస్సు యాత్ర చేపట్టే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఇతర పార్టీల నుంచి అసంతృప్త నాయకులను, మున్సిపల్ స్థాయి ప్రతినిధులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను బిఆర్‌ఎస్ ముమ్మరం చేసింది. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఇతర ముఖ్య నేతలు కరీంనగర్ అభివృద్ధి అంశాలను లేవనెత్తుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు.

జిల్లాపై పట్టు కోసం బీజేపీ సన్నాహాలు

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఉత్సాహంతో ఉన్న బిజెపి, జిల్లాలో తన బలాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని చూస్తోంది. బిజెపి జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ కరీంనగర్లో భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్రను విజయవంతం చేసేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి. ఈ పాదయాత్ర కోసం కరీంనగర్ పరిసర ప్రాంతాల నుండి వేలాదిగా జనాలను, పార్టీ కార్యకర్తలను తరలించేందుకు వాహనాలను, వసతులను బిజెపి సమకూర్చింది. దీని ద్వారా కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా తామే ప్రత్యామ్నాయం అని నిరూపించుకోవాలని బిజెపి చూస్తోంది.  బిఆర్‌ఎస్, బిజెపిలో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తుండగా జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి.

మరిన్ని వార్తలు