5 September, 2026 | 5:59 AM

గట్లనర్సింగాపూర్ గ్రామవాసికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

05-09-2026 | 04:50am

నేడు సీఎం చేతుల మీదుగా అవార్డు ప్రధానం

భీమదేవరపల్లి సెప్టెంబర్ 4 (విజయక్రాంతి) : హనుమకొండ జిల్లా(Hanumakonda district) భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్  గ్రామానికి చెందిన అడ్డగట్ల నాగరాజు(Addagatla Nagaraju)  పాలిటెక్నిక్ లెక్చరర్(Polytechnic Lecturer) కేడర్లో ప్రతిష్టాత్మకమైన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు(Best Teacher Award) ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం(Teachers Day) సందర్భంగా సెప్టెంబర్ 5న కొడంగల్లో నిర్వహించనున్న కార్యక్రమంలో తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించనున్నారు.

ప్రస్తుతం ఆయన ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల జి పి డబ్ల్యు సిద్ధిపేటలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగంలో లెక్చరర్గా మరియు ఇన్చార్జ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా విధులు నిర్వహిస్తున్నారు.అడ్డగట్ల నాగరాజు  దివంగత అడ్డగట్ల కృష్ణమూర్తి , శ్రీమతి సరోజన  కుమారుడు. సాధారణ కుటుంబం నుంచి ఉన్నత విద్యను సాధించి, సాంకేతిక విద్యా రంగంలో ప్రతిభ చాటడం గ్రామానికి గర్వకారణంగా నిలిచింది.

ఆయన జేఎన్టీయూ హైదరాబాద్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎం.టెక్ పూర్తి చేసి, హైదరాబాద్లోని చైతన్య డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో పీహెచ్.డి పూర్తి చేశారు. 2013లో ఏపీపీఎస్సీ ద్వారా పాలిటెక్నిక్ సేవల్లో చేరి, అప్పటి నుంచి విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు.విద్యార్థులకు ప్రాయోగిక జ్ఞానం అందించడం, వినూత్న బోధనా విధానాలు అమలు చేయడం, మరియు అకాడెమిక్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.

అడ్డగట్ల నాగరాజు  విజయానికి ఆయన భార్య అక్కెల కృష్ణవేణి  ప్రోత్సాహం కీలకమైంది. ఆమె కూడా పాలిటెక్నిక్లో లెక్చరర్గా సేవలు అందిస్తూ ఆయనకు నిరంతరం ప్రేరణగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బొల్లంపల్లి అజయ్ కుమార్  ,గ్రామస్థులు, బంధువులు  శ్రేయోభిలాషులు అడ్డగట్ల నాగరాజును హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు