దక్షిణ కాశీ సిద్దేశ్వర ఆలయానికి భక్తుల రద్దీ

24-11-2026 | 02:45pm

హనుమకొండ, నవంబర్ 24 (విజయక్రాంతి): కార్తీక పౌర్ణమి (Karthika Pournami) పర్వదినాన్ని పురస్కరించుకొని హనుమకొండలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచిన స్వయంభు శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వయంభూ లింగంగా కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు.

పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు (Special Pujas), అభిషేకాలు నిర్వహించేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. రద్దీ (Devotee Rush) పెరగడంతో స్వామివారి దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పడుతోంది. అయినప్పటికీ భక్తులు ఓపికగా క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

కార్తీక మాసం చివరి పౌర్ణమి కావడంతో ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. భక్తుల రాకతో ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

మరిన్ని వార్తలు