కరాటే మాస్టర్ ధామేర శంకర్‌ను అభినందించిన సిపి శ్వేత

06-10-2026 | 10:59pm

హనుమకొండ, అక్టోబర్ 6 (విజయక్రాంతి): బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించిన హనుమకొండ నయీమ్ నగర్ ప్రాంతానికి చెందిన కరాటే మాస్టర్ ధామేర శంకర్(Karate Master Dhamera Shankar)ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అభినందించారు. వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఆగస్టు 16వ తేదీన చెన్నైలో నిర్వహించిన కరాటే పోటీల్లో నిరవధికంగా ఆరు గంటల పాటు కరాటే ప్రదర్శన నిర్వహించినందుకు గాను కరాటే మాస్టర్ శంకర్ కు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది.ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ కఠోర సాధన, పట్టుదలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించడం అభినందనీయమని అన్నారు. దామేర శంకర్ సాధించిన ఈ ఘనత, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు