జ్ఞానేశ్ కుమార్‌పై టీపీసీసీ ఫైర్
హైదరాబాద్: ఎన్నికల సంఘం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా(Gnanesh Kumar Resignation) చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆయన ఆరోపించారు. ‘సేవ్ డెమోక్రసీ’(Save Democracy) నినాదంతో ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు మహేష్ గౌడ్ తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 8న ‘చలో లోక్‌భవన్’(Chalo Lok Bhavan) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
గురువారం ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్‌భవన్ వరకు భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం భారీ ప్రదర్శనతో పాటు సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్తో పాటు ఇండియా కూటమి ప్రతినిధులు పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, ప్రజాస్వామ్య పరిరక్షణ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని కాంగ్రెస్ పేర్కొంది.