ఐవిఎఫ్ ఆధ్వర్యంలో ఉత్తమ బతుకమ్మ పురస్కారాలు

18-10-2026 | 09:45pm

వినూత్న రీతిలో బతుకమ్మల అలంకరణ

అభినందించిన జిల్లా న్యాయ సేవాధికారిత సంస్థ కార్యదర్శి నాగరాణి 

కామారెడ్డి, అక్టోబర్ 18 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) కేంద్రంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(International Vaishya Federation) ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ పండుగ(Saddula Bathukamma Festival) పురస్కారాల కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి విద్యానగర్ కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  జిల్లా న్యాయ సేవాధికారిత సంస్థ కార్యదర్శి నాగరాణి హాజరై మాట్లాడారు. బతుకమ్మ పండుగ మహిళా సాధికారికకు, సామాజిక ఐక్యతకు(Social Unity), మహిళల గౌరవానికి ప్రతిక అని అన్నారు. సాంప్రదాయాలను గౌరవించి భవిష్యత్తు తరాలకు అందజేయాలని ఉత్తమ బతుకమ్మలను తీర్చిదిద్దిన వారందరికీ అభినందించి, బహుమతులను అందజేశారు. 

ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు,ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎర్రం చంద్రశేఖర్ చంద్రకళ లు మాట్లాడుతూ మహిళలను ప్రోత్సహించాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. అన్నదాన కార్యక్రమాలను,ఉత్తమ విద్యార్థుల అభినందన సభ, సామాజిక సేవా కార్యక్రమాలను ఐవిఎఫ్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని అన్నారు. 

ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్ అర్చన, కోశాధికారి కస్వ వెంకన్న లలిత,యువజన విభాగం అధ్యక్షుడు ఎర్రం ఈశ్వర్,మహిళా విభాగం అధ్యక్షురాలు బుక్క రజని, ప్రధాన కార్యదర్శి గజవాడ అన్నపూర్ణ రవికుమార్, ఆధ్యాత్మిక విభాగం అధ్యక్షుడు ఎల్లంకి సుదర్శన్,ఉపాధ్యక్షులు రాజూరి మనోహర్ సంధ్య,కూర దిగంబర్ వసంత,కూర సురేశ్ రమ, వీరమల్లి శ్రీనివాస్ సరస్వతి,గంప చక్రపాణి ఉమారాణి లు అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు