3 September, 2026 | 1:46 AM

సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి లక్ష్మీబాయి పేరు పెట్టాలని కోరుతూ సీఎంకు లేఖ

03-09-2026 | 12:31am
  1. బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ 
  2. సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ

ముషీరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): సైదాబాద్‌(Saidabad)లో గురువారం ప్రారంభించనున్న స్టీల్ బ్రిడ్జి(steel bridge)కి స్వాతంత్య్ర సమర యోధురాలు, తొలి మహిళా మంత్రి, బాలికల విద్యావ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన సంఘం లక్ష్మీబాయి(Sangam Lakshmibai) పేరు పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్(Jajula Srinivas Goud) డిమాండ్ చేశారు.

అల్వాల్ టిమ్స్‌(Alwal Tims)కు మాజీ సీఎం అంజయ్య, ఎల్బీనగర్ టిమ్స్‌(LB Nagar TIMS)కు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, వరంగల్ టిమ్స్‌(Warangal TIMS)కు ప్రొఫెసర్ జయశంకర్(Jayashankar) పేర్లు పెట్టనున్నట్లు సీఎం ప్రకటించిన నేపథ్యంలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి సంఘం లక్ష్మీబాయి పేరు పెట్టాలని కోరుతూ బుధవారం సీఎంకు లేఖ రాశారు.

సమాజ హితం కోసం జీవితాలను అంకితం చేసిన బీసీ మహనీయుల పేర్లను హైదరాబాద్‌లోని పలు నిర్మాణాలకు సముచితంగా పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలిచిన సంఘం లక్ష్మీబాయి చరిత్రను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని జాజుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.