3 September, 2026 | 5:21 AM

గజం రూ.2.70 లక్షలు

03-09-2026 | 03:25am

కేపీహెచ్‌బీలో ఓపెన్ ప్లాట్లకు రికార్డు ధర

కూకట్‌పల్లి, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలోని(KPHB Colony) ఓపెన్ ప్లాట్లకు మరోసారి రికార్డు ధర పలికింది. కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్ లోని 16 ఎమ్‌ఐ జి ప్లాట్లకు బుధవారం హౌసింగ్ బోర్డ్ (Housing Board) బహిరంగ వేలం నిర్వహించింది. ఈ ప్లాట్ల బహిరంగ వేలం కోసం ఆగస్టు 10న తెలంగాణ హౌసింగ్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

గజానికి కనీస ధర రూ.1.60 లక్షలుగా నిర్ధారించారు. బుధవారం జరిగిన బహిరంగ వేలంలో గజం రూ.2.70 లక్షలకు అమ్ముడుపోయిందని, మరో ప్లాటు గజం రూ.2.36 లక్షల రూపాయలకు అమ్ముడుపోయిందని హౌసింగ్ బోర్డు అధికారులు తెలిపారు.

మరో రెండు ప్లాట్లను రూ.2.06 లక్షలకు కొనుగోలు చేశారని, పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలం పాటలో మొత్తం 19 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. మొత్తంగా జరిగిన వేలంపాటలో సగటు గజం ధర రూ.1.79 లక్షలు పలికింది. ఈ వేలం ద్వారా హౌసింగ్ బోర్డ్‌కు సుమారు రూ.47.14 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.