ఓబీసీ కాలమ్ చేర్చాలి

12-09-2026 | 05:30am

జాతీయ జనగణనపై తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం

  1. కేంద్రానికి పంపించనున్న ప్రభుత్వం 
  2. కాంగ్రెస్, బీజేపీ మధ్య వాడివేడి చర్చ 
  3. సభ నుంచి బీజేపీ వాకౌట్ 
  4. బీసీలంటే బీజేపీకి వ్యతిరేకతనే 
  5. డిప్యూటీ సీఎంతో సహా మంత్రుల మండిపాటు

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం(Central Government) నిర్వహించే జనగణన(Census)లో ఓబీసీ కులం కాలమ్(OBC caste column) చేపట్టాలనే అంశంపై అసెంబ్లీ(Assembly)లో వాడివేడిగా చర్చ జరిగింది. బీసీలకు మోసం చేస్తుం ది..? మీరంటే.. మీరు అంటూ కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మద్య వాగ్వాదం జరిగిం ది. జనగణనలో ఓబీసీ కులాలను లెక్కించాలనే ప్రతిపాదనను  మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అసెంబ్లీలో  ప్రవేశపెట్టారు. ఈ అంశంపై తీర్మానం చేసి కేంద్రానికి పం పాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు(Sridhar Babu), వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. బీజేపీ, ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యేలు మాట్లాడారు.  60 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ కుల గణన ఎందుకు చేయ లేదు.. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌న్‌తో పాటు బీసీలకు ప్రతి ఏటా రూ. 20 వేల కోట్లు ఇస్తామన్న నిధులు ఎందుకు ఇవ్వలేదు..? అని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. జనగణనలో ఓబీసీ కాలం చేర్చడానికి బీజేపీ అనుకూలమా..? వ్యతిరేకమా..? చెప్పాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు బీజేపీని ప్రశ్నించారు.

బీసీ ప్రధాని అని చెప్పుకునే నరేంద్ర మోదీ కుల గణనలో ఓబీసీ కాలం ఎందుకు చేర్చలేదని, బీసీలంటే బీజేపీకి లెక్కలేదా..? మనువాద సిద్దాంతాన్ని ఇంకా అమలు చేస్తున్నారని మం త్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి మండిపడ్డారు. బీసీలను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీనే మోసం చేస్తుందంటూ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. బీసీ మహిళా మంత్రిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన కాంగ్రెస్.. బీసీల అభివృద్ది కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు.

ఆ తర్వాత అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చే శారు. ఆ తర్వాత సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాం బశివరావు మాట్లాడుతూ, గతంలో ఏమి జరిగిందనేది కాదని, ఇప్పుడు ఓబీసీల కోసం ఏమి చేద్దామనే అంశంపై చర్చించాలన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో బీసీలకు తీవ్ర అన్యా యం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీల తరహాలోనే ఓబీసీల లెక్క లు ఉండాల్సిందేనని, అందుకు తమ పార్టీ సం పూర్ణంగా మద్దతిస్తుందని తెలిపారు. ఓబీసీ కాలమ్ కోసం ఎంఐఎం పార్టీ కూడా మద్దతిస్తుందని ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ తెలిపారు.

కులగణన చేద్దామా..? వద్దా..? 

దేశంలో సామాజిక అసమానతలను తొ లగించి బలహీన వర్గాలకు న్యాయం చేయాలంటే జనగణనలో కులగణనను తప్పనిసరి గా చేర్చాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కులగణన చేద్దా మా..? వద్దా..? అనే విషయా న్ని బీజేపీ స భ్యులు సూటిగా చెప్పాలని ఆయన డిమాం డ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వే ను దేశానికి ఆదర్శంగా తీసుకుని, దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి సమగ్ర సర్వే నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

కుల గణన ఒక ఎక్స్‌రే లాంటిదని, స మాజంలోని అసమానతలు తొలగించడానికి అ వకాశం ఉంటుందని  భట్టి తెలిపారు.  రాష్ట్ర అసెంబ్లీలో జనగణన, కులగణన అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. కుల గణన అనేది కులాలకు, రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం కాదని, సమాజ శ్రేయస్సుకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితు లపై సమగ్ర సర్వే నిర్వహించిందని భట్టి తెలిపారు.

తెలంగాణలో నిర్వహించిన ఈ సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పు డు ప్రతిపక్ష సభ్యులు సైతం అభినందించారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్‌లోని  వివిధ పార్టీల నాయకులతో పాటు ప్రధానమంత్రిని కూ డా కలిసి దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని విజ్ఞప్తి చేశారని చెప్పారు. కేంద్రం నుంచి ఆశించిన విధంగా స్పందన రాకపోవడంతో ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించి సమావేశం నిర్వహించి, తెలంగాణలో అమలు చేసిన విధానా న్ని వివరించా మని తెలిపారు. 

ప్రస్తుతం జరుగుతున్న జనగణనలో కులగణనను చేర్చకపోవడం బా ధాకరమన్నారు. ఇచ్చిన మాట ప్రకారం జనగణనలో కులగణనను చేర్చాలని డిమాండ్ చేశారు. కులగణన లేకుండా దేశంలోని బలహీన వర్గాల వాస్తవ పరిస్థితులను ఎలా గు ర్తిస్తారని ప్రశ్నించారు.   రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని, రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా తెలంగాణలో నిర్వహించిన తరహాలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వే నిర్వహిస్తామని ప్రకటించారు. 

వాకౌట్ చేయడం దారుణం..

బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  ప్రవేశ పెట్టిన బీసీ తీ ర్మాణంపై బీజేపీ వాట్ అవుట్ చేయడం దారుణమని మంత్రి సీత క్క మండిపడ్డారు. మోదీ పేరుకే బీసీ..కానీ జనగణలో కులగణనను చేయడం లేదని విమర్శించారు. ‘ బీసీలు వెనకబడిన వర్గాలు కాదు.. వెన్నెముక కులాలు. కుల వృత్తుల మీద ఆదా ర పడ్డ కులాలు బీసీలుదేశ జీడీపీలో కీలక పాత్ర . సాంకేతికత పెరిగిన కాలంలోనూ బీసీలు కుల వృత్తుల మీదే ఆధారపడి బతుకుతున్నారు. బీసీ తీర్మాణానికి మద్దతు ఇవ్వకుండా సబ్జెక్ట్ డైవర్ట్ చేసి, బీజేపీ వాక్ అవుట్ చేయడమంటే వాళ్ల దురుద్దేశం అర్ధం అవుతుంది.

బీసీ ప్రధాని అని చెప్పుకోవడమే కా నీ, బీసీల ప్రయోజనాలు బీజేపికి పట్టవు. సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ  కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే పాయల శం కర్  డైవర్ట్ చేసి  మాట్లాడడం దారుణం. కనీసం బీజేపీ ప్లోర్ లీడర్‌గా బీసీ లేరు.. వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఈ దే శంలో బీసీలకు ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్. మొదటి ఓబీసీ ప్రధాని దేవేగౌడ్ కి మద్దతు నిలిచిం ది కాంగ్రెస్ పార్టీ అని, మంత్రి పొన్నం  పెట్టిన రిజల్యూషన్ కి సభ ఏకగ్రీవంగా ఆమోదించాలి ’ అని మంత్రి సీతక్క కోరారు.

తెలం గాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన దేశానికే రోల్‌మోడల్ అని మంత్రి పొన్నంప్రభాకర్ అన్నారు.  బీజేపీ మనువాద సంస్కృతిని అమలు చేస్తూనే ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలంటే ఆ పార్టీకి గిట్టదని మంత్రి మండి పడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు క ల్పించాలని తమ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు. బీజేపీని  బీసీ సంఘాలు, ప్రజలు నిలదీయాలని మంత్రి కోరారు. 

బీసీ మంత్రిత్వ ఏదీ..

దేశవ్యాప్తంగా బీసీల జనాభా, సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన గణాంకాలు అందుబాటులోకి రావాలం టే కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో బీసీల కులగణనను తప్పనిసరిగా చేపట్టాలని రాష్ట్ర  మంత్రి వాకిటి శ్రీహరి డిమాం డ్ చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఎవరో ఇచ్చిన దానం కాదని, అది బీసీల హక్కు, సామాజిక న్యాయం కోసం దశాబ్దాలుగా సాగిన పోరాటం ఫలితమని మంత్రి స్పష్టం చేశారు. 1953లో అప్పటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం కాకా కాలేల్కర్ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు.

అనంతరం 1979లో బి.పి. మండల్ కమిషన్ ఏర్పడి దేశవ్యాప్తంగా బీసీల సామాజిక, విద్యా వెనుకబాటుతనాన్ని అధ్యయనం చే సిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమిషన్ సిఫార్సు చేసింద ని, 1990లో ఆ సిఫార్సుల అమలుకు కేంద్ర ప్రభుత్వం ముం దడుగు వేసిందని గుర్తు చేశారు. 1992లో ఇంద్రా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు ూదీ రిజర్వేషన్లకు సంబంధించి కీలకమైన మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు.

1993లో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్  ఏర్పడిందని, 2018లో 102వ రా జ్యాంగ సవరణ ద్వారా దానికి రాజ్యాంగ హోదా లభించింద ని తెలిపారు. రిజర్వేషన్ల ప్రయోజనాలు అన్ని వర్గాలకు సమానంగా అందుతున్నాయా అనే అంశాన్ని పరిశీలించేందుకు జస్టిస్ రోహిణి కమిషషన్‌ను మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు.  తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభు త్వం నిర్వహించిన సమగ్ర కుల సర్వే సామాజిక న్యాయానికి పునాది అని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ‘జిత్నీ ఆబాదీ.. ఉత్నా హక్ ’ అనే రాహుల్ గాంధీ నినాదంతో ముందుకుసాగుతున్నామని తెలిపారు. 

మరిన్ని వార్తలు