రాష్ట్రంలో ‘ఫసల్ బీమా’ అమలు చేయాలి
బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ పాయల్ శంకర్
రైతు సమస్యలపై అసెంబ్లీకి ట్రాక్టర్ ర్యాలీ
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవ డంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ పాయల్ శంకర్(BJLP Deputy Floor Leader Payal Shankar) విమర్శించారు. ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ పథకాన్ని అమలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రైతుల సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లేందుకు శుక్రవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి అసెంబ్లీ వరకు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే పాల్వయి హరీష్ బాబు, రామారావు పాటిల్, పైడి రాకేష్‌రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. రైతాంగ డిమాండ్ల ప్లకార్డులతో అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు.
నిరసన తెలపకుండా ప్రజాస్వామ్యబద్ధమైన ఎమ్మెల్యేల హక్కులను కాలరాయడంపై పాయల్ శంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మీ డియాతో మాట్లాడుతూ..‘ప్రకృతి వైపరీత్యా లు, తెగుళ్ల కారణంగా పంటలు నష్టపోయి రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల వేలాది మంది రైతులు నష్టపరిహారానికి దూరమవుతున్నారు.
ప్రభు త్వం ప్రకటించిన రుణమాఫీ కూడా సంపూర్ణంగా అమలు కాక అరకొరగానే మిగిలిపో యింది. రూ. 2 లక్షల రుణమాఫీ హామీ నెరవేరలేదని, అర్హులైన ప్రతి రైతుకూ వెంటనే సంపూర్ణ రుణమాఫీతో పాటు పంటలకు గి ట్టుబాటు ధర కల్పించాలి. రైతుల గళాన్ని నొ క్కడం ప్రభుత్వానికి సాధ్యం కాదు. పంట న ష్టపరిహారం, సకాలంలో మద్దతు ధర, పూర్తిస్థాయి రుణమాఫీ అందించే వరకు శాసనస భ లోపలా, వెలుపలా బీజేపీ నిరంతరం పోరాడుతుంది’ అని ఆయన స్పష్టం చేశారు.