గోదావరిలో వరద పోతుంటే.. బురద రాజకీయమేంది?
- వెంటనే మోటార్లు నడిపి రిజర్వాయర్లు నింపాలి
- ప్రభుత్వానికి బీఆర్ఎస్ నేత హరీశ్ డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): గోదావరి నదిలో వరద పోతుంటే రాష్ట్ర ప్రభుత్వం బురద రాజకీయం చేస్తున్నదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు(BRS leader Harish Rao) దుయ్యబట్టారు. సాగునీళ్లు అందక పంటలు ఎండిపోతున్నా గోదావరిలోని భారీ వరద ప్రవాహాన్ని లిఫ్ట్ చేయడంలో సర్కార్ నిర్లక్ష్యం వహిస్తున్నదని మండిపడ్డారు.
ఈ మేరకు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Minister Uttam Kumar Reddy)కి హరీశ్‌రావు శు క్రవారం లేఖ రాశారు. ‘గోదావరి జలాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవస్థను నిర్మించారు. ఇందులో భాగంగా 141 టీఎంసీల సామ ర్థ్యం గల రిజర్వాయర్లను ఏర్పాటు చేశారు. గోదావరిలో వరద వచ్చినప్పుడు ఆ నీటిని ఒడిసిపట్టి రిజర్వాయర్లను నింపితే రైతులకు ఎంతో మేలు కలుగుతుంది’ అని తెలిపారు.
డెడ్ స్టోరేజీ ఆందోళనకరం..
గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతున్నా అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయకసాగర్ రిజర్వాయర్ డెడ్‌స్టోరేజీలో ఉండటం ఆందోళనకరమని హరీశ్ పేర్కొన్నారు. మల్లన్నసాగర్ రిజ ర్వాయర్‌లో ప్రస్తుతం 13 టీఎంసీలు మాత్రమే ఉందని తెలిపారు. ఇక్కడ 50 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం అందుబాటులో ఉం దని, మల్లన్నసాగర్ నిండుకుండలా మారితే హైదరాబాద్ తాగునీటి అవసరాలతోపాటు ప్ర భు త్వం చెప్తున్న మూసీ ప్రాజెక్టుకు కూడా ఇక్కడి నుంచి నీటిని తరలించే అవకాశం ఉంటుందని లేఖలో ప్రస్తావించారు.
కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లోనూ 15 టీఎంసీలకు కేవలం 6 టీఎంసీలే ఉన్నాయని, ఇక్కడికి సైతం నీటి ని ఎత్తిపోస్తే యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఎల్లంపల్లిలో నీటి ఎత్తిపోతలు ప్రారంభిస్తే మిడ్ మానేరు సహా అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లకు నీటిని తరలించడంతో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కూడా పూర్తి పరిష్కారం లభి స్తుందని, ఈ రిజర్వాయర్లను నింపడం వల్ల దాదాపు 5లక్షల ఎకరాల సాగువిస్తీర్ణానికి దోహ దం చేసినట్లవుతుందని ఆయన వివరించారు.
ఇప్పటికైనా నింపండి..
మిడ్ మానేరు దిగువన ఉన్న లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండీ)లో ప్రస్తుతం 11 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని, ఇక్కడికి నీటిని తరలిస్తే కరీంనగర్, వరంగల్ జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయని హరీశ్‌రావు తెలిపారు. ‘సిద్దిపేట జిల్లా నర్మెట్టలో మా ప్రభుత్వ హయాంలో నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పామాయిల్ ఫ్యాక్టరీ నిర్వహణ కోసం రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించేందుకు ప్రత్యే కంగా ఏర్పాట్లు చేశారు. అయితే రంగనాయక సాగర్‌లో నీళ్లు లేకపోవడం వల్ల పామాయిల్ ఫ్యాక్టరీ నిర్వహణ ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితితో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నా రు’ అని లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నీటి కోసం రైతులు కండ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తుంటే, ప్రభుత్వం మాత్రం నదుల్లో వస్తున్న నీళ్లను లిఫ్ట్ చేయకుండా కిందికి వదిలిపెడుతున్నదని తెలిపారు. ప్రస్తుతం గోదావరి నదిలో ఎల్లం పల్లి వద్ద వరద ప్రవాహం భారీగా కొనసాగుతున్నదని, ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని అన్ని మోటార్లను నడిపి నీళ్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కండ్లు తెరవాలని.. ఎల్ నినోను సాకుగా చూపకుండా, అందివచ్చిన గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకునేలా 24 గంటలూ అన్ని మోటా ర్లు నడిపి రిజర్వాయర్లను నింపాలని ఆయన డిమాండ్ చేశారు.