ఆమ్మో.. కోతులు!
కోతుల బెడదతో లక్ష్మాపూర్ ప్రజల హాహాకారాలు
బయటికి వెళ్లాలంటే భయం.. ఇళ్లలోనూ ప్రశాంతత కరువు
అధికారులు స్పందించి గ్రామాన్ని కోతుల నుంచి రక్షించాలని వేడుకోలు
శామీర్ పేట్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): మూడు చింతలపల్లి మున్సిపాలిటీ లక్ష్మాపూర్ లో కోతుల బెడద(Monkey Menace) రోజురోజుకూ పెరిగిపోతోంది. గుంపులుగా సంచరిస్తున్న కోతులు ఇళ్లలోకి చొరబడుతూ ప్రజలను భ యభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇళ్ల బయట ఉంచిన వస్తువులు, ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
కోతుల గుంపులు వీధుల్లో విచ్చలవి డిగా తిరుగుతుండటంతో చిన్నారులు, వృ ద్ధులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సైతం కోతుల కారణంగా ఆందోళన చెందుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.ఇళ్ల పైకప్పులు, విద్యుత్ తీగలపై కోతులు గుంపులుగా చేరుతున్నాయి.దీంతో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కలిగే ప్రమాదం ఉందని ప్రజ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇంట్లో తలుపులు తెరిచి ఉంచితే కోతులు లోపలికి వస్తున్నాయని వాపోతున్నారు.
ఆహారం కనిపిస్తే ఒక్కసారిగా దూసుకొస్తుండటంతో మహిళలు, చిన్నారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కోతులను తరిమేందుకు ప్రయత్నిస్తే తిరిగి దాడి చేసే పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు కోతుల బెడదతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో కోతుల సంఖ్య పెరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కోతులను పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను కోరుతున్నారు. గ్రామంలోని ప్రధాన వీధులు, కాలనీలు, పాఠశాలల పరిసరాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కోతుల బెడదను నియంత్రించేందుకు ప్రత్యే క బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించాలని కోరు తున్నారు. కో తుల సమస్యపై అధికారులు తక్షణమే దృష్టి సారించాలని గ్రామస్తులు వేడు కుంటు న్నారు.కోతుల నుంచి మా గ్రామాన్ని రక్షించండి అంటూ అధికారులను కోరుతున్నా రు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.లేనిపక్షంలో భవిష్యత్తులో పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలని లక్ష్మపూర్ గ్రామ ప్రజలు కోరుతున్నారు.
కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలి
గత కొన్నేళ్లుగా గ్రా మంలో కోతుల బెడద రోజురోజుకూ పెరిగిపోతోంది. గుంపులుగా సంచరిస్తూ ఇళ్లలోకి చొరబడుతూ ప్రజలను భయభ్రాంతుల కు గురిచేస్తున్నాయి.చిన్నపిల్లలు, వృద్ధు లు బయటకు రావాలంటేనే గ్రామస్థులు జంకుతున్నారు.కోతుల దాడులతో ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందు తున్నారు.కోతుల బెడదను అరికట్టి గ్రా మ ప్రజలకు రక్షణ కల్పించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను గ్రామస్థు లు వేడుకుంటున్నారు.
సింగం భాస్కర్ ( లక్ష్మపూర్)