కత్వను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు

26-09-2026 | 05:50am

ఏండ్లనాటి సమస్య తీరి మూగబోయిన కత్వ గల గలా 

పారబోతుందని ఆశా భావం వ్యక్తం చేసిన ప్రజలు

చేవెళ్ళ, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): రెండు రోజుల క్రితం ‘మూగబోయిన కత్వ‘ అన్న కథనానికి వికారాబాద్ సబ్ డివిజన్ ఇరిగేషన్ అధికారులు(Vikarabad Sub-division Irrigation Officials) స్పందించారు. ఈ నెల 23న విజయక్రాంతిలో కత్వ దుస్థితిని దీనస్థితిని... ప్రచురితం అయింది. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని నవాబుపేట్ మండలంలోని అక్నాపూర్ గ్రామంలో 100 ఏళ్ల క్రితం నిర్మించిన కత్వసమస్యపై ప్రచురించింది.

ఈ కథనానికి ఇరిగేషన్ అధికారులు స్పందించి శుక్రవారం ఇరిగేషన్ డీఈ వెంకట్ రమణ, ఏఈ వెంకటేశ్వర్లు చెక్డ్యా మ్ను సందర్శించి క్షేత్రస్థాయిలో చెక్డ్యామ్ పరిస్థితిని పరిశీలించారు. నీటి నిల్వ, గేట్ల ఏ ర్పాటు, గతంలో చేపట్టిన పనుల వివరాల ను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గతంలో మిషన్ కాకతీయ పేస్ 3 లో భా గంగా చెక్డ్యామ్ వద్ద పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.

అయితే ప్రస్తుతం నీరు బయటకు వెళ్లే గేట్ల వద్ద కొన్ని సమస్యలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని గేట్లు ఏర్పాటు చేయలేకపోవడానికి గల కారణాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తామని చెప్పారు. చెక్డ్యామ్కు సంబంధించి ఇంకా చేపట్టాల్సిన పనులు, అవస రమైన మరమ్మతుల వివరాలను సేకరించి ఉన్నతాధికారుల నివేదిక పాపంతమన్నారు.

చెక్డ్యామ్కు అవసరమైన పనులకు త్వరలోనే అంచనాలు  రూపొందించి, నిధులు మంజూరైన అనంతరం పనులు ప్రారంభించేలా చ ర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపా రు. చెక్డ్యామ్ సమస్యను పరిశీలించేందు కు అధికారులు గ్రామానికి రావడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఏండ్లనాటి స మస్యకు శాశ్వత పరిష్కారం లభించబోతుందని కత్తులకు అను సంధానమైనది కాలువలద్వారా వందలాది ఎకరాల ఆయకట్టు పూ ర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని రైతులు గ్రామస్తులకు ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు