విశ్వకర్మ యజ్ఞంలో మల్లారెడ్డి

20-09-2026 | 08:42pm

జవహర్‌నగర్‌లో ఘనంగా ప్రత్యేక పూజలు.. పాల్గొన్న బీఆర్‌ఎస్‌ నాయకులు

జవహర్‌నగర్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): విశ్వకర్మ జయంతి(Vishwakarma Jayanti)ని పురస్కరించుకుని జవహర్‌నగర్‌లో విశ్వకర్మ యజ్ఞం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(MLA Chamakura Malla Reddy) ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు, యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య యజ్ఞాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ విశ్వకర్మ భగవానుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. విశ్వకర్మ సమాజం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జవహర్‌నగర్ బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విశ్వకర్మ సంఘం ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు