నిజామాబాద్ జిల్లాలో పిడుగు పడి విద్యార్థి మృతి
20-09-2026 | 08:44pm
వ్యవసాయ పనులు చేస్తుండగా విద్యార్థి దుర్మరణం
నిజామాబాద్, సెప్టెంబర్ 20 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం దేవి గాడ్ పంచాయతి (Devi God Panchayat) పరిధిలో ఆదివారం పిడుగు పడి విద్యార్థి మృతి చెందాడు. దేవి గాడ్ తండాకు చెందిన బాదావత్ చరణ్(18) వ్యవసాయ పొలంలోకి వెళ్ళగా ఆదివారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో పిడుగు పడి బాదావత్ చరణ్ మృతి చెందినట్లు ఇందల్వాయి ఎస్సై సుమలత తెలిపారు. ఇంటర్ చదువుతున్న బాదా వత్ చరణ్ ఆదివారం కావడంతో వ్యవసాయ పనులకు వెళ్ళాడు.
పిడుగు పడడంతో గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు నిజా మాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లలోగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుమలత తెలిపారు.