సమిష్టి కృషితోనే తెలంగాణ మరింత అభివృద్ధి: ఎస్పీ రాజేష్ చంద్ర

17-09-2026 | 12:08pm

ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ  

కామారెడ్డి, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): సమిష్టి కృషితోనే తెలంగాణ మరింత అభివృద్ధి సాధించవచ్చు అని జిల్లా ఎస్పీ  రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) అన్నారు. గురువారం కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో ప్రజా పాలన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకుంటూ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, ప్రజల భద్రతకు భరోసా కల్పించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణతో పనిచేస్తూ ప్రజలకు మరింత మెరుగైన పోలీసింగ్ సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను సత్వరం పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ కె. నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, ఆర్ఎస్ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది, డీపీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




మరిన్ని వార్తలు