భారత్‌పై నమ్మకం పెరిగింది..! ఎగ్జాంపుల్‌ చెప్పిన ప్రధాని మోదీ

17-09-2026 | 12:18pm
  1. ఢిల్లీలో సెమికాన్ ఇండియా-2026 ప్రారంభం
  2. 300 అంతర్జాతీయ కంపెనీలు హాజరు
  3. చిప్‌ తయారీపై భారత్‌ ఫోకస్‌  

న్యూఢిల్లీ: భారతదేశ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ వేగంగా విస్తరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తెలిపారు. ఇది ఆవిష్కరణ, పెట్టుబడి, వృద్ధికి కొత్త అవకాశాలను కల్పిస్తోందని ఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2026లో(Semicon India 2026) ప్రసంగిస్తూ అన్నారు. ఢిల్లీ యశోభూమిలో సెమికాన్ ఇండియా -2026 సదస్సును ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు. 17 నుంచి 19 వరకు మూడు రోజులు మెగా చిప్ సమ్మిట్(Mega Chip Summit) జరగనుంది. సిలికాన్ టు సిస్టమ్స్ థీమ్ తో సెమికాన్-2026 కొనసాగుతున్న ఈ సదస్సులో 300 అంతర్జాతీయ కంపెనీ ప్రతినిధులు పాల్గొనున్నారు. భారత్ లో చిప్ పెట్టుబడులపై కేంద్రం ఫోకస్ పెట్టింది.

ఇటీవల గణాంకాల్లో జీడీపీ 7.8 వృద్ధి నమోదైందని చెప్పారు. సెమీకండక్టర్ల రంగంలో భారత్ రెండో దశకు చేరిందని తెలిపారు. చిప్ ప్రొడక్షన్ అనేది ఒక నిరంతర ప్రక్రియని వివరించారు. చిప్ డిజైన్ కోసం యువత స్కిల్ పెంచుకుంటోందని వివరించారు. ప్రపంచ దేశాలు పదేళ్లపాటు చేసింది.. భారత్ 4 ఏళ్లలోనే చేసిందని హర్షం వ్యక్తం చేశారు.  భారత్ లో తయారై చిప్ లు ప్రపంచానికి చేరువవుతున్నాయని పీఎం మోదీ(PM MODI) స్పష్టం చేశారు. భారత్ లో బ్రిక్స్ సమ్మిట్‌ను(BRICS Summit) విజయవంతంగా నిర్వహించుకున్నామన్న మోదీ భారత్‌పై ప్రపంచానికి నమ్మకం పెరిగింది అనడానికి 'బ్రిక్స్‌ సమ్మిట్‌'ఎగ్జాంపుల్‌ అన్నారు.

మరిన్ని వార్తలు