గ్రీన్, రీసైకిల్ టాయిలెట్ల ప్రారంభం

12-09-2026 | 04:05am

బిల్‌గేట్స్ ఫౌండేషన్ రూపకల్పన

ప్రశంసించిన మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా ఎదిగిన హైదరాబాద్ నగరం మరో ప్రపంచస్థా యి అత్యుధునిక సాంకేతికతకు వేదిక కాను ంది. బిల్‌గేట్స్ ఫౌండేషన్(Bill Gates Foundation) అభివృద్ధి చేసిన పునర్వినియోగానికి వీలుగా నీటిని శుద్ధి చేసే నెట్‌జీరో, గ్రీన్ టాయిలెట్లను దేశంలో మొట్ట మొదటిగా హైదరాబాద్‌లోని లుంబినీ పార్కులో ఏర్పాటు చేశారు. నీటిని పునర్వినియోగించే ఈ నెట్ జీరో టాయిలెట్ల సముదాయాన్ని ఐటీ, పరిశ్రమలు, శాసనవ్యవహా రాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu), రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌లు ప్రారంభించారు.

రూ. కోటితో ఏర్పా టు చేసిన ఈ మరుగుదొడ్లను ఎక్కడికైనా తరలించే వీలుంటుంది. రీఫ్లో సంస్థ టీ వర్క్స్ తో కలిసి వాటిని ఇక్కడే ఉత్పత్తి చేయాలని నిర్ణయించడం పట్ల శ్రీధర్‌బాబు ప్రశంసించారు.సోలార్ విద్యుత్తుతో నడిచే ఈ టాయి లెట్లకు విద్యుత్తు కనెక్షన్ అవసరం లేదు. ఒకసారి ట్యాంకును నింపితే అదే నీటిని అనేక సార్లు శుద్ది చేసి తిరిగి వినియోగిస్తుందని వెల్లడించారు. టెక్నాలజీని ఉచితంగా అందజేస్తున్న గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులను అభినందించారు. కార్యక్రమంలో గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి అర్చనా వ్యాస్, రీఫ్లో ప్రతినిధి అభిషేక్, టీవర్క్స్ సీఈవో జోగిందర్ తనికెళ్ల తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు