కొండా సురేఖకు మీనాక్షినటరాజన్ ఫోన్
ఇటీవల జరిగిన పరిణామాలపై ఆరా..?
పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ కావాలని సూచన
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షినటరాజన్(Meenakshi Natarajan) శుక్రవారం మాజీమంత్రి కొండా సురేఖ(Konda Surekha)కు ఫోన్ చేసి మాట్లాడారు. ఇటీవల పార్టీలో, రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై మీనాక్షినటరాజన్ ఆరా తీసినట్లుగా తెలిసింది. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ అయినప్పటి నుంచి సైలెంట్‌గా ఉంటున్నారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా రావడం లేదు. దీంతో కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాశంగా మారింది.
ఈ తరుణంలో మీనాక్షినటరాజన్ నేరుగా ఫోన్ చేసి మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకున్నది. అంతర్గత విభేదాలు, వ్యక్తిగత కారణాలు పక్కనపెట్టి పార్టీ కార్యక్రమాల్లో తిరిగి క్రియాశీలకంగా మారాలని కొండా సురేఖకు సూచించారు. పార్టీ అధిష్ఠానం నుంచి సూచనలు రావడంతో.. కొండా సురేఖ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా? పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారా? లేదా ..? అన్న అంశంపై కాంగ్రెస్‌తో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది.