ఉచిత ప్రయాణం లేకున్నా సరే.. కొత్తపేటలో బస్సులు ఆపండి సార్
12-09-2026 | 04:25am
బయ్యారంలో మహిళల రాస్తారోకో
మహబూబాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): ఉచిత ప్రయాణం లేకున్నా మానే.. ఏళ్ల తరబడిగా ఆపుతున్న బస్ స్టాప్ లో బస్సులను మాత్రం ఆపండి చాలు.. అంటూ మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) బయ్యారంలో మహిళలు రాస్తారోకో నిర్వహించారు.
బయ్యారం మండలం కొత్తపేటలో గతంలో మాదిరిగా ఆర్డనరీ సర్వీస్‌లతో పాటు ఎక్సప్రెస్ బస్సులను ఆపాలని మహిళలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఫ్రీ బస్సు సౌకర్యం లేనప్పుడు అన్ని బస్సులకు ఈ బస్టాప్‌లో స్టాప్ ఉందన్నారు.ఫ్రీ బస్సు లేకపోయినాపర్వాలేదు.. మా ఊర్లో బస్సులు ఆపాలని మహిళలు డిమాండ్ చేశారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని వారిని శాంతింపజేసి సమస్యను అధికారులకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు.