5 September, 2026 | 5:16 AM

అంబేద్కర్ అందరివాడు..

05-09-2026 | 04:20am

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

సికింద్రాబాద్, సెప్టెంబర్04 (విజయక్రాంతి): అంబేద్కర్ అందరివాడు అని ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఈ నాడు మనం ఈ పదవులు అనుభవిస్తున్నాం అని మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao), బాలానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి శుక్రవారం బాలానగర్లో కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలు, అమలుకాని 6 గ్యారంటీలకు వ్యతిరేకంగా పోరుబాట కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా బాలానగర్ కమాన్ నుంచి దళిత నాయకులు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా బయలుదేరి బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే  మాధవరం కృష్ణారావు, మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాదయాత్రగా వినాయక నగర్లోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఏ ర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దళితులకు రూ. 10 లక్షల దళితబంధు అందించామని, కాం గ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు దళితబంధు పథకాన్ని ఎత్తివేసి దళితులను మోసం చేసిందని విమర్శించారు.అంబేద్కర్ అందరివాడు అని ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఈనాడు మనం ఈ పదవులు అనుభవిస్తునా ్నం అని మాధవరం కృష్ణారావు అన్నారు.

దళిత అభ్యున్నతి కి కృషి చేసిన మహానుభావుడు అని ఆయన సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.అలాగే మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులు, బీడీ కార్మికులకు నెలకు రూ.4,000 పెన్షన్, దివ్యాంగులకు నెలకు రూ.6,000 పెన్షన్, కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకాల కింద ఆడబిడ్డలకు తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, కళాశాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, సుమారు 1,000 రోజుల పాలనలో ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే నిలదీశారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, దళితబ ంధు సహా సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బిఆర్‌ఎస్ పార్టీ ఆ ధ్వర్యంలో ప్రజల తరఫున నిరంతరం పోరాటం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహి ళలు, దళిత, నాయీబ్రాహ్మణ సంఘాల నాయకులు, 22 ఏ బాధితులు, బస్తీల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు