మరోసారి జాతీయ వేదికపై ప్రసంగించనున్న జగిత్యాల డాక్టర్
27-11-2026 | 04:54pm
జగిత్యాల, నవంబర్ 27 ( విజయ క్రాంతి ): జగిత్యాలకు చెందిన ప్రముఖ సీనియర్ డాక్టర్(Prominent senior doctor) భీమనాతిని శంకర్ న్యూఢిల్లీ లో 2027 సంవత్సరం ఫిబ్రవరి 18 నుండి 21 వరకు జరగనున్న అఖిల భారతీయ ఫిజీషయన్ల జాతీయ సదస్సులో మరోసారి ప్రసంగించే అరుదైన అవకాశం లభించింది.
ఈ సారి “ గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్యలు - నిర్ధారణ, నివారణ, చికిత్సలు “ అనే అంశంపై వివరించనున్నారు. తమ జగిత్యాలకు చెందిన డా. శంకర్ జాతీయ వేదికపై ప్రసంగించే అరుదైన అవకాశం లభించినందులకు పలువురు ప్రముఖులు, అభిమానులు , బంధుమిత్రులు, సహచర వైద్యులు అభినందనలు తెలుపుతూ హర్షం వెలిబుచ్చారు.