పేదలకు వరం..ఇందిరమ్మ బీమా పథకం

27-11-2026 | 04:50pm

తాడ్వాయి,నవంబర్,27( విజయ క్రాంతి): పేదలకు వరం ఇందిరమ్మ జీవిత బీమా పథకం(Indiramma Life Insurance Scheme) అని కాంగ్రెస్ పార్టీ తాడువాయి మండల  ఎస్సీ సెల్ అధ్యక్షులు గైని రాజలింగం తెలిపారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ లో ఆయన శుక్రవారం మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా నిలవాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.

ఈ పథకం ప్రతి పేద కుటుంబానికి భరోసాగా నిలుస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల భరోసా లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు