మల్యాల లో ఘనంగా రక్తదాన శిబిరం
మల్యాల,సెప్టెంబర్ 29,(విజయ క్రాంతి ): మల్యాల: భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో (Seva Sankalp Abhiyan Program)భాగంగా మల్యాల. కొడిమ్యాల. మండలాల బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి *ముఖ్య అతిథిగా బీజేవైఎం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సంఘ నరేష్ హాజరై రక్తదాతలను అభినందించారు.
ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సంఘ నరేష్ మాట్లాడుతూ, రక్తదానం చేయడం అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అనేక మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని అన్నారు. సమాజ సేవలో యువత ముందుండాలని, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని బీజేపీ కార్యకర్తలు ప్రజా సేవా కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటున్నారని తెలిపారు.21 మంది రక్తదానం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరినీ ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ“రక్తదానం – ప్రాణదానం” అనే సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మల్యాల మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం. బీజేవైఎం మండల అధ్యక్షుడు పొనగంటి గౌతం. ప్రధాన కార్యదర్శి రాజశేఖర్. మహిళా మోర్చా అధ్యక్షురాలు కటకం లత. ఎస్సీ మోర్చా అధ్యక్షుడు సుంకపాక టైటెస్. బోట్ల ప్రసాద్. వన్ హాస్పిటల్, మహేష్ రెడ్డి .ఓబిసి మోర్చా మండల అధ్యక్షుడు బొమ్మెన పరమేష్ .మద్దుట్ల సర్పంచి సంకుర్తి తిరుపతి. గడ్డం నడిపి మల్లేశం.కొక్కెర మల్లేశం,కందుల వినోద్ బండారి రాజు.అట్ట సదాశివరెడ్డి.రాచర్ల రాములు. కొడిమ్యాలమండల ప్రధాన కార్యదర్శి హరీష్.అనిల్ యాదవ్. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులను, రక్తదాతలను నాయకులు అభినందించారు.