గోదావరిలో మురుగు కలవకుండా చర్యలు

25-11-2026 | 05:10am

ధర్మపురి మహాలక్ష్మి ఘాట్ వద్ద మురుగునీరు గోదావరిలో కలవకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు 

జగిత్యాల/ధర్మపురి, నవంబర్ 24 (విజయక్రాంతి): గోదావరి పుష్కరాల(Godavari Pushkarala) అభివృద్ధి పనులపై  దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్(Shailaja Ramaiyer) ప్రత్యేక దృష్టి  సా రించారు. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్(Jagtial Collector Satya Prasad)   ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. ధర్మపురి ప్రాంతంలో(Dharmapuri region) మంజూరైన రూ.18 కోట్లతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను(development works) వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి  చేసేలా కార్యాచరణ రూపొందించారు.

గోదావరి పుష్కరాలు నేపథ్యంలో జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, కోటిలింగాల ప్రాంతాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంతున్నారు. ధర్మపురి ప్రాంతంలో మున్సిపాలిటీ పరిధిలో 1.08 ఎకరాల భూసేకరణకు సంబంధించి, కోటిలింగాల ప్రాంతంలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 3 ఎకరాల భూసేకరణకు సంబంధించి 2026 సెప్టెంబర్ 22న ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. భూసేకరణకు సంబంధించిన తదుపరి చర్యలను వేగవంతం చేయనున్నారు.

ధర్మపురిలో కొత్త ఘాట్ నిర్మాణానికి అవసరమైతే సమీపంలోని స్మశాన వాటికను తొలగించి, ఆ ప్రాంతాన్ని చదును చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఘాట్ వద్ద మురుగునీటి సమస్య పరిష్కారానికి సంబంధించి సెక్షన్ 10ఏ మినహాయింపు కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి  పంపించారు.ఎస్టీపీ పనులు పుష్కరాల నాటికి పూర్తికాని పరిస్థితి ఏర్పడినా మురుగునీరు గోదావరిలో కలవకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నారు. మురుగు నీటిని దారి మళ్లించేందుకు పటిష్టమైన ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

డంప్ యార్డును కూడా దారి మళ్లించే చర్యలు చేపడుతున్నారు, ధర్మపురి, కోటిలింగాల పుష్కర ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ టెండర్లు, భూసేకరణ, రహదారులు, ఘాట్ల అభివృద్ధి తదితర అంశాల పురోగతిని  కలెక్టర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

గోదావరి పుష్కరాలు2027 ఏర్పాట్లకు ఇంకా ఏడు నెలల సమయం మాత్రమే ఉన్నందున పనులను ఈ నెలలోనే ప్రారంభించి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయనున్నట్టు కలెక్టర్   స్పష్టం చేశారు.ధర్మపురి, కోటిలింగాల ప్రాంతాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ఘాట్లు, రహదారులు,పారిశుద్ధ్యం, మురుగునీటి మళ్లింపు, తాగునీరు, భద్రత తదితర అంశాలపై సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నారు.

మరిన్ని వార్తలు