పూల సాగుతో అధిక లాభాలు

29-09-2026 | 02:09pm

కోరుట్ల రూరల్,(విజయక్రాంతి): మండలంలోని ధర్మారం గ్రామంలో రైతు కడతల రాజు సాగుచేస్తున్న బంతి పూల తోటను(Marigold Cultivation) ఉద్యాన విస్తరణ అధికారి అన్వేష్(Horticulture Extension Officer Anvesh) మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... కడతల రాజు ఉద్యానశాఖ సూచనల మేరకు 2 ఎకరాలలో బంతి సాగు చేపట్టడం జరిగిందనీ, ప్రస్తుతం ఈ తోటలో పూల దిగుబడి మొదలైందనీ సరిగ్గా పండగ సమయానికి అధిక దిగుబడి వచ్చి రైతుకు మంచి ఆదాయం వస్తుందని తెలిపారు.

ప్రస్తుతం ఉన్న ఎల్నినో పరిస్థితుల దృశ్య రైతులు(Farmers) వరి కాకుండా ఈ విధంగా తక్కువ నీరు అవసరం ఉన్న , ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటలు పండించడం వలన అధిక ఆదాయం పొందవచ్చని సూచించారు. పూల తోటలు సాగుచేసుకునే రైతులకు ఉద్యాన శాఖ ద్వారా  సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని ఇతర రైతులు కూడా సీజన్ దృష్టిలో పెట్టుకొని దానికి అనువుగా ఉండే ప్రత్యామ్నాయ పంటలు పండించుకొని ఉద్యాన శాఖ ద్వారా అందించే సబ్సిడీలు సద్వినియోగం చేసుకొని అధిక ఆదాయం పొందాలని  తెలిపారు.

మరిన్ని వార్తలు