కళాకారుల సంక్షేమం, సంస్థ అభివృద్ధికి కృషి
జగిత్యాల కళాకారుల ఐక్య వేదిక అధ్యక్షులు బోగే అశోక్
జగిత్యాల, నవంబర్ 27 ( విజయ క్రాంతి ): జగిత్యాల జిల్లాలోని కళాకారుల సంక్షేమము(Welfare of Artists), సంస్థ అభివృద్ధి కై నూతన పాలకవర్గం నిరంతరం కృషి చేస్తుందని సంఘం నూతన అధ్యక్షులు బోగే అశోక్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక బండారి గార్డెన్ లో జగిత్యాల కళాకారుల ఐక్య వేదిక (జె. కే. ఐ. వి ) నూతన పాలకవర్గం సభ్యుల ప్రమాణ స్వీకారంను వ్యవస్థపాక కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా నూతన పాలకవర్గ సభ్యులచే వ్యవస్థపాక కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించి, పాలకవర్గం సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా అధ్యక్షులు అశోక్ తో పాటు వ్యవస్థపాక, పాలకవర్గం కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఐక్యంగా జగిత్యాల జిల్లా కళాకారులూ నిలవడం అభినందనీయం అన్నారు.
జగిత్యాల కళాకారుల ఐక్య వేదిక రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందనడంలో ఎలాంటి అతిషయోక్తి లేదన్నారు. కళాకారుల ఐక్య వేదిక ద్వారా సహచర కళాకారులకు ప్రోత్సాహం అందించే దిశగా చర్యలు గైకొంటామని తెలిపారు. అందరు ఐక్యంగా ఉండి సంఘం పటిష్టత, నూతన కమిటీకి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.
వ్యవస్థపాక కమిటీ, నూతన కమిటీ సమన్వయముతో జిల్లా కళాకారుల ఐక్య వేదిక బలోపేతం కు నిరంతరం కృషి చేస్తామన్నారు. నూతన పాలకవర్గం సభ్యుల సంక్షేమం కొరకు అనేక అంశాలను పరిగణలోకి తీసుకోని వాటి అమలు దిశగా ఐక్యంగా ముందుకు వెళ్తుందని అశోక్ తెలిపారు. తమ వల్ల వ్యవస్థపాక కమిటీ కి కానీ, సభ్యులకు గానీ ఇబ్బంది కలిగితే పెద్దమనసుతో క్షమించాలని కోరారు.
భవిష్యత్ లో అందరి సమన్వయముతో ముందుకి సాగుతామని, ఫిర్యాదుల కోరకు ఒక సభ్యున్ని నియమించి సభ్యుల ఇబ్బందుల పరిష్కారంకు కమిటీ కృషి చేస్తుందన్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ బాధ్యులు బొడ్డుపెల్లి లక్ష్మి నారాయణ,
మెండు హరీష్ పటేల్,రాజారాం మోహన్ రెడ్డి, పెరంబదూర్ విజయలక్ష్మి, బొడ్డు సౌజన్య, క్రాంతి దగడ్, భూక్యా గంగాధర్ నాయక్, మల్యాల సతీష్, చిరంజీవి, గుండేటి సందీప్, శ్రీ చరణ్, శ్రీనివాస్, సంగెపు బాబు, గజ్జెల వందన, ఇప్పల లక్ష్మి, ఉమా తో పాటు వ్యవస్థపాక కమిటీ బాధ్యులు ఎస్. వి మల్లిక్ తేజ, రాజ్ నరేంద్ర తో పాటు కళాకారులూ పాల్గొన్నారు.