బోధన్ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటన

27-11-2026 | 08:11pm

పలు గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు..

మహిళలకు ఇందిరమ్మ చీరలు, లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ

బోధన్ , నవంబర్ 27(విజయక్రాంతి): ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి(Podduturi Sudarshan Reddy) శనివారం బోధన్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మహిళా మండలి భవనాల ప్రారంభోత్సవాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల(Indiramma house) మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

పర్యటన షెడ్యూల్:

* ఉదయం 11:30 గంటలకు బూలక్ష్మి క్యాంపులో మహిళా మండలి భవనం ప్రారంభోత్సవం, చీరలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ.

* మధ్యాహ్నం 12 గంటలకు పెంట కాలాన్‌లో మహిళా మండలి భవనం ప్రారంభోత్సవం, పంపిణీ కార్యక్రమాలు.

* మధ్యాహ్నం 1 గంటకు పెగడపల్లిలో మహిళా మండలి భవనం ప్రారంభోత్సవం, చీరలు, ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ.

* మధ్యాహ్నం 3 గంటలకు మావంది కలాన్‌లో పసుపు వాగుపై నిర్మించిన వంతెన, మహిళా మండలి భవనం ప్రారంభోత్సవం, ఇందిరమ్మ చీరలు, ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ.

ఈ కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, పీఏసీఎస్ అధ్యక్షులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పార్టీ వర్గాలు కోరాయి.

మరిన్ని వార్తలు