భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కొండా సురేఖ దంపతులు

27-11-2026 | 08:09pm

వరంగల్: వరంగల్ మహానగరంలోని(Warangal Metropolitan City) చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి ఆలయాన్ని(Sri Bhadrakali Temple) శుక్రవారం ఉదయం రాష్ట్ర దేవాదాయ శాఖ మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దంపతులు సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన వారికి అర్చకులు, ధర్మకర్తలు ఘన స్వాగతం పలికారు. పూజానంతరం ఆలయ మహా మంటపంలో అర్చకులు, వేద పండితులు వారికి మహాదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేష వస్త్రములు, ప్రసాదము బహుకరించారు.

మరిన్ని వార్తలు