పేదల సొంతింటి కల సాకారం

27-11-2026 | 08:14pm

కొండపాక, నవంబర్ 27( విజయక్రాంతి ): అర్హులైన పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని దుద్దెడ గ్రామ సర్పంచ్ మిద్దె శివకుమార్(Duddeda village Sarpanch Midde Shiva Kumar) అన్నారు.  ఈ సందర్భంగా మిద్దె శివకుమార్ మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Housing Scheme) ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. శుక్రవారం లబ్దిదారులకు(Beneficiaries_ ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలను అందజేశారు. నిరుపేదల సొంతింటి కల నెరవేరింది,లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.

 ఈ కార్యక్రమంలో దుద్దెడ గ్రామ సర్పంచ్ మీదే శివకుమార్, ఉప సర్పంచ్ పల్లె జానకి యాదగిరి, పంచాయతీ కార్యదర్శి శోభ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొమ్ము మల్లికార్జున్, పాలకవర్గం సభ్యులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎండి నూరుద్దీన్, మాజీ సర్పంచ్ పెద్దంకుల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు