అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలి
15-10-2026 | 05:14pm
- జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
- బసవరాజుపల్లిలో ఘనంగా మహా అన్నదానం
గణపురం, అక్టోబర్ 15 (విజయ క్రాంతి):అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్(District SP Sirisetti Sankeerth)అన్నారు. బస్వరాజు పల్లి గ్రామంలో గురువారం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఎస్ఐ అశోక్,లు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దాత పెంట కిరణ్, గ్రామ సర్పంచ్ చింతకుంట్ల సునీత శ్రీనివాస్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు.