విద్యానగర్‌లో వైభవంగా చండీ హోమం

15-10-2026 | 06:05pm

ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ ఐపీఎస్

హుజురాబాద్: (విజయక్రాంతి): హుజురాబాద్ పట్టణంలోని విద్యానగర్‌లో శ్రీదేవి శరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చండీ హోమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ వి. నవీన్ చంద్ ఐపీఎస్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, పండుగలను ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వైష్ణవి మురళి మంచికట్ల, దామెర అనుషా–అనురాగ్, గురుస్వామి నటరాజ్ బుర్ర, ఎల్.వి. అర్జున్‌తో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు