రైల్వే లైన్ కోసం పోస్ట్ కార్డు ఉద్యమం
బెల అక్టోబర్ 15(విజయక్రాంతి): కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అధికారంలో ఉన్నప్పుడు విడుదల చేసిన గెజిట్ ప్రకారమే రైల్వే లైన్ మ్యాప్ మార్చకుండా మహారాష్ట్రలోని గడ్ చందూర్ నుంచి బేల,జైనథ్ మీదుగా ఆదిలాబాద్ కు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని గురువారం బేల మండలంలో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు.
ఈ మేరకు బేల మండలంలోని సాంగిడి గ్రామంలో ప్రజలను చైతన్య పరుస్తూ గడ్ చందుర్ నుండి జైనథ్ బేల ఆదిలాబాద్ వరకు రైల్వే లైన్ నిర్మించాలని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ప్రజలకు వివరించారు.పాత పద్ధతిలో రైల్వే లైన్ ఏర్పాటు చేసినట్లయితే అనేకమంది పేద ప్రజలకు సులభ ప్రయాణంతో పాటు తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చని ఆయన వివరించారు.
ఆ రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వంపై ఈ ఉద్యమం ద్వారా ఒత్తిడి తీసుకురావాలని ఆయన ఈ కార్యక్రమం చేపట్టినట్లు ప్రజలకు తెలియజేశారు. ఇందులో ఉప సర్పంచ్ జిమ్మ శేఖర్,మంచికంటి నవనీత్,రవీందర్ పటేల్,విలాస్,వేదాంత్ రెడ్డి నర్సింగ్,అమోల్,శ్రీపాల్ రెడ్డి,తది తరులు ఉన్నారు.