తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గం ఏర్పాటు

15-10-2026 | 05:56pm

ఖానాపూర్ ( విజయక్రాంతి): తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్(Telangana Electricity Employees Union) A 82 ఎంపీడీసీఎల్ నిర్మల్ జిల్లా నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నట్టు సంఘ సభ్యులు తెలిపారు. జిల్లా సమావేశం నిర్వహించి రాష్ట్ర నాయకులు సమక్షంలో నూతన కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షులుగా లింగన్న, ప్రధాన కార్యదర్శిగా నిరంజన్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా రంజిత్ తో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు ఎన్నికల సభ్యులకు కమిటీ ఆధ్వర్యంలో సన్మానం చేశారు.

మరిన్ని వార్తలు