పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

06-10-2026 | 11:16pm

ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి 

స్పెషల్ క్యాంపెయిన్ 6.0 లో భాగంగా ఈ - వేస్ట్ డిస్పోజల్ కార్యక్రమం

భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 06 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని సింగరేణి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి అన్నారు. స్పెషల్ క్యాంపెయిన్ 6.0 కార్యక్రమంలో భాగంగా మంగళవారం జీఎం కార్యాలయ ప్రాంగణంలో ఐటీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన డిస్పోజల్ ఆఫ్ ఈ - వేస్ట్ డిస్పోజల్ కార్యక్రమం(E-Waste Disposal Campaign)లో జీఎం ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జీఎం అధికారులు, ఉద్యోగులతో కలిసి కార్యాలయంలోని పాడైన, పనికిరాని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాలను సేకరించి, వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డబ్బాలలో వేశారు. అనంతరం జీఎం మాట్లాడుతూ పాత, పనికిరాని ఎలక్ట్రానిక్ పరికరాలను కార్యాలయాల్లో పేరుకుపోకుండా సేకరించి, పర్యావరణానికి హాని కలగకుండా సరైన పద్ధతిలో డిస్పోజల్ చేయడం ఎంతో ముఖ్యమని అన్నారు.

మొబైల్ ఫోన్లను కూడా కేవలం కొత్త అప్‌డేట్లు లేదా కొత్త మోడళ్లు వచ్చాయనే కారణంతో అనవసరంగా మార్చకుండా, ప్రస్తుత ఫోన్‌ను సాధ్యమైనంత వరకు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జీఎం రామన్ వి పాఠక్, సివిల్ ఏజీఎం రవికుమార్, ఈ, ఎం ఏజీఎం సాంబశివరావు, ఫైనాన్స్ డీజీఎం రాజేశ్వర్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, సర్వే ఆఫీసర్ శైలేంద్ర కుమార్, ఐటీ సీనియర్ ప్రోగ్రామర్ శంకర్  జీఎం కార్యాలయ వివిధ విభాగాలకు చెందిన  అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు