సాహిత్ జ్ఞాపకార్థం స్మారక గీతం ఆవిష్కరణ

01-10-2026 | 07:45pm

గణపురం,(విజయక్రాంతి): వెంపటి సాహిత్ జ్ఞాపకార్థం(Memory of Vempati Sahith) గాంధీనగర్‌లోని ప్రేమ నిలయం అనాథాశ్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్మారక గీతం ఆవిష్కరించారు  అనంతరం ఆశ్రమంలోని బాలలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి గాంధీనగర్ సర్పంచ్ ఇంజపల్లి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, జిల్లా కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, భూపాలపల్లి పట్టణ చైర్మన్ బుర్ర కొమురయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా సంక్షేమ అధికారి ఎం. మల్లేశ్వరి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ అన్నాజాన్ హాజరయ్యారు.

అలాగే గణపురం మండల కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు తాళ్లపల్లి భాస్కరరావు, గ్రామ ఉపసర్పంచ్ బర్రెల శోభ, మున్సిపల్ కౌన్సిలర్ పొన్నగంటి శ్రీనివాస్, డీసీసీ ప్రధాన కార్యదర్శి వెంకీ యాదవ్, గాంధీనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోతురాజు సురేష్, డీసీసీ కార్యవర్గ సభ్యుడు అప్పల శ్రీనివాస్, మాజీ పీఏసీఎస్ డైరెక్టర్ సెగ్గం శ్రీనివాస్, మాదం శరత్ బాబు యాదవ్, మాదం భరత్ యాదవ్, కొడాలి బాలరాజు యాదవ్, మాజీ ఉపసర్పంచ్ మిట్టపల్లి సారంగపాణి, వచ్చు మొగిలి, ప్రగతి యువజన సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ వెంపటి పద్మ భువన సుందర్, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు