ఐసిడిస్ ప్రాజెక్ట్ మందారం అంగన్వాడి కేంద్రంలో పోషణ మాస కార్యక్రమం
16-09-2026 | 06:19pm
మహాముత్తారం సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): మందారం గ్రామపంచాయతీ పరిధిలోని మందారం అంగన్వాడీ కేంద్రంలో 9వ జాతీయ పోషణ మాసం- 2026 కార్యక్రమంలో భాగంగా, సర్పంచ్ బెల్లంకొండ లక్ష్మి ముఖ్య అతిథిగా పోషణ మాసం కార్యక్రమం(Nutrition Month program) మాదారం అంగన్వాడి కేంద్రంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సూపర్వైజర్ నాగరాణి మాట్లాడుతూ పోషకాహార ప్రాముఖ్యత గురించి తెలియజేయడమైనది. బాలామృతంతో & టి.హెచ్.ఆర్ రెసిపీస్ అన్ని తయారు చేసే విధానాల గురించి తల్లులకు అవగాహన కల్పించడం జరిగింది. ఆ తర్వాత పోషణ మాసం ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, పిల్లలు అంగన్వాడీ టీచర్, ఆయా& గ్రామస్తులు పాల్గొన్నారు.