స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

04-11-2026 | 12:36pm

బాన్సువాడ, నవంబర్ 4 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీలో బుధవారం నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాన్సువాడ తహసీల్దార్ రాజా నరేంద్ర గౌడ్(Banswada Tahsildar Raja Narendra Goud) పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసి, వాటి ఉపయోగాలు, ప్రత్యేకతలను వివరించారు.

ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు రేషన్ సేవలు మరింత సులభతరం అవుతాయని, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఇవి కీలకంగా ఉపయోగపడతాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ కౌన్సిలర్ మహమ్మద్ ఖాలేక్, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యురాలు సుల్తానా గౌస్, మైనార్టీ నాయకుడు దావూద్, జీపీఓ హర్ష, టీచర్స్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు