బుగులోని వెంకటేశ్వర స్వామి జాతరకు పటిష్ట భద్రత

20-11-2026 | 05:13pm

జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ 

భూపాలపల్లి / రేగొండ, నవంబర్ 20 (విజయక్రాంతి) : ఈనెల 23, 24, 25 తేదీల్లో తిరుమలగిరి శివారులో నిర్వహించనున్న శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర(Festival of Lord Venkateswara) భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్(District SP Sirisetti Sankeerth) శుక్రవారం పరిశీలించారు. జాతర ప్రాంగణాన్ని సందర్శించిన ఆయన భక్తుల(devotees) రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, బందోబస్తు ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు.

భక్తులకు(devotional) ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం కొండపై శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, సీఐ కరుణాకర్ రావు, ఎస్ఐలు ఉన్నారు.

మరిన్ని వార్తలు