విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించాలి

20-11-2026 | 05:01pm

జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 అధికారిక లోగో, మస్కట్ గోడ పత్రికలు ఆవిష్కరించిన ఎస్పీ

భూపాలపల్లి టౌన్, నవంబర్ 20 ( విజయక్రాంతి ) : విద్యార్థులు చదువుతో(Students' studies) పాటు క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్(Jayashankar Bhupalpally District SP Sirisetti Sankeerth) అన్నారు. రాష్ట్రంలో డిసెంబర్ 11 నుండి 22 వరకు నిర్వహించనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్(Khelo India Youth Games) 2026 కు సంబంధించిన అధికారిక లోగో, మస్కట్ నీలమణి గోడ పత్రికలను(Wall newspapers) ఎస్పీ జిల్లా పోలీస్ కార్యాలయంలో డీవైఎస్ఓతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తిని(Sportsmanship) పెంపొందించడంతో పాటు, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి జాతీయస్థాయిలో ప్రోత్సహించేందుకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎంతగానో దోహదపడతాయని అన్నారు. జాతీయస్థాయి క్రీడా పోటీలకు తెలంగాణ రాష్ట్రం వేదిక కావడం గర్వకారణమని అన్నారు.

క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల, జట్టుగా పనిచేసే నైపుణ్యాలను పెంపొందిస్తాయని తెలిపారు. జిల్లాలోని యువ క్రీడాకారులు తమలోని ప్రతిభను గుర్తించి నిరంతరం సాధన చేయాలని, ప్రభుత్వం కల్పిస్తున్న క్రీడా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రీడల ద్వారా జిల్లాకు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు