క్రీడాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

20-11-2026 | 05:11pm
  1. క్రీడల్లో రాణించే విద్యార్థులను ప్రోత్సహిస్తాం
  2. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు
  3. ఘనంగా ఉమ్మడి జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ కబడ్డీ, ఖోఖో పోటీలు

సుల్తానాబాద్, నవంబర్ 20  (విజయక్రాంతి): క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులను(Students') ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు(Chintakunta Vijayaramana Rao) అన్నారు. విద్యార్థులు(Students) చదువుతోపాటు క్రీడలపైనా ఆసక్తిపెంపొందించుకోవాలనిసూచించారు. పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల(Government Junior College) మైదానంలో శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్‌-14 బాలబాలికల ఎస్‌జీఎఫ్ కబడ్డీ, ఖోఖో పోటీలను(SGF Kabaddi and Kho-Kho Competition) ఎమ్మెల్యేవిజయరమణారావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతోపాటు మానసిక వికాసానికి, క్రమశిక్షణకు, పట్టుదలకు దోహదపడతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని, వారికి తగిన అవకాశాలు, ప్రోత్సాహం కల్పిస్తే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని పేర్కొన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు.

ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్ మాట్లాడుతూ సుల్తానాబాద్ క్రీడలకు పుట్టినిల్లుగా నిలుస్తోందని, ఇక్కడ ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ క్రీడాకారుల అభ్యున్నతికి విశేష కృషి చేస్తూ, పోటీల నిర్వహణకు సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపల ప్రకాష్ రావు, మున్సిపల్ కమిషనర్ రమేష్, కరీంనగర్ ఎస్‌జీఎఫ్ కార్యదర్శి బన్సీలాల్, పేట అధ్యక్ష కార్యదర్శులు వేల్పుల సురేందర్, తుల శోభారాణి, వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి రమేష్, పేట రాష్ట్ర బాధ్యులు కొమురోజు శ్రీనివాస్, కౌన్సిలర్లు గాజుల రాజమల్లు, చింతల రాజు, కుమార్ కిషోర్, అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారుడు గెల్లు మధుకర్, పీడీలు రవి, ప్రసాద్, శ్రీనివాస్, వెంకటేష్, ప్రణయ్, విష్ణు, రేణుక, ఖాజాబీ, సరస్వతి, శ్రీలక్ష్మి, సంపత్, కల్వల వెంకటేష్, అజ్జు, సత్యం, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు