ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని డిమాండ్

20-11-2026 | 05:08pm

ముకరంపుర, నవంబర్ 20(విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్రంలోని 12 ప్రభుత్వ విశ్వ విద్యాలయాల్లో(Government University) ఏళ్లుగా సేవలందిస్తున్న ఒప్పంద అధ్యాపకుల ఉద్యోగాలను(Contract faculty jobs) తక్షణమే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ శాతవాహన యూనివర్సిటీ(Satavahana University) ఒప్పంద అధ్యాపకులు మానవహారం నిర్వహించారు. యూనివర్సిటీ ఆవరణలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో అధ్యాపకులంతా పెద్ద ఎత్తున పాల్గొని తమ ఐక్యతను చాటారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాల బోధన(University teaching), పరిశోధన, పరీక్షల నిర్వహణలో(Conduct of Examinations) తాము కీలక పాత్ర పోషిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని, నూతన నియామకాల కంటే ముందే తమకు ఉద్యోగ భద్రత కల్పించి క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల అధ్యక్ష కార్యవర్గ సభ్యులైన డాక్టర్ మనోజ్, డాక్టర్ రమేష్ రెడ్డి, డాక్టర్ తిరుపతి, డాక్టర్ రాజు, డాక్టర్ కిరణ్ వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.

End

మరిన్ని వార్తలు