మొక్క రక్షణకు ముళ్ళ కంచె ఇలా! పెరిగేది ఎలా?
బోథ్. నవంబర్ 20 (విజయక్రాంతి): మండలంలోని రోడ్లకు ఇరువైపులా అటవీ శాఖ(Forest Department) వారు మొక్కలు నాటారు. అయితే బూత్ నుండి మర్లపల్లి వరకు, బోత్ ఎక్స్ రోడ్ నుండి బొత్ పట్టణం వరకు, పొచ్చెర క్రాస్ రోడ్ నుండి ఘన్పూర్ వరకు నాటిన మొక్కలు గాలికి వదిలేశారు. మొక్కలు నాటిన ఆరు నెలల వరకు సంరక్షించిన అటవీ శాఖ అధికారులు(Forest Department officials) ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.
ముళ్ళ కంచెలే రక్షణ.... మండల కేంద్రంలోని మరల పెళ్లి వైపు వెళ్లి రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కల చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగాయి. అయితే అక్కడక్కడ చుట్టూ నాటిన ప్లాస్టిక్ వలయం(Plastic ring) విరిగిపోయాయి. అయితే వాటిని తిరిగి సరి చేయడంలో నిర్లక్ష్యం కనిపిస్తున్నది. మరోవైపు మొక్కల పక్కనే వివిధ రకాల కలుపు మొక్కలు పెరగడంతో(Plant growth) నాటిన మొక్కలు(Planted saplings) ఎదగకుండా పోతున్నాయి. మొక్కలకు నీటిని పట్టేందుకు నిధులు మంజూరు అవుతున్న అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు కలుపు మొక్కల నివారణకై నిధులు మంజూరు అవుతున్న ఏ మాత్రం కలుపు మొక్కలను నివారించడం లేదని అంటున్నారు.
అధికారుల పర్యవేక్షణ అవసరం
రేంజ్ పరిధిలో ఎవెన్యూ ప్లాంటేషన్(Avenue Plantation) కింద వేలాది మొక్కలు నాటిన కనిపించకుండా పోతున్నాయి. కలుపు నివారణ చర్యలు చేపట్టకపోగా సకాలంలో నీటి తడులు ఇవ్వకపోవడంతో ఆశించిన స్థాయిలో మొక్కలు ఎదగడం లేదు మొక్కల పెంపకంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.