పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

20-11-2026 | 04:58pm

తాడ్వాయి,నవంబర్,20( విజయక్రాంతి ): ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా(Financial Security) కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రతినిధులు తెలిపారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామంలో శుక్రవారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని(Indiramma Family Life Insurance Scheme) గ్రామ సర్పంచ్ నరేష్(Village Sarpanch Naresh) ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ... ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు.

ఈ పథకంలో ప్రతి పేద,మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా(Financial Security) కల్పించి అండగా నిలవాలని ప్రభుత్వం నిర్దేశించిందని తెలిపారు. కుటుంబ పెద్ద కు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా అండగా నిలవడం కోసం ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని(Indiramma Family Life Insurance Scheme) ప్రారంభించిందన్నారు. ఈ పథకం పేద కుటుంబాలకు అండగా నిలువబోతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారు సంజీవులు, తాడువాయి,దేమికలాన్ సింగిల్ విండోల చైర్మన్లు సంతాజీగారి సుధాకర్ రావు. ఏనుగు వెంకట్ రెడ్డి, నాయకులు జూకంటి వెంకట్ రెడ్డి, పైడి రాజేశ్వర్ రెడ్డి, అంబీర్ శ్యామ్ రావు, షౌకత్ అలీ,గైని శివాజీ,మండల ప్రత్యేక అధికారి రఘునందన్ రావు, ఎంపీడీవో భరత్ కుమార్,బీరయ్య,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు