స్పాట్ కౌన్సెలింగ్‌తో ఖాళీ సీట్లను భర్తీ చేయాలి
కరీంనగర్ సిటీ నవంబర్ 20(విజయక్రాంతి) : శాతవాహన యూనివర్సిటీ(Satavahana University) ప్రధాన ద్వారం ఎదుట గత ఏడు రోజులుగా విద్యార్థి జేఏసీ నాయకులు(Student JAC leaders) చేపడుతున్న రిలే నిరాహార దీక్షలకు తెలంగాణ రక్షణ సేన(Telangana Rakshana Sena) పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపాడుగు హరిప్రసాద్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉంటేనే అధ్యాపకులు, సిబ్బంది, ఉన్నతాధికారులకు(Faculty, staff, and senior officials) ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.
ఖాళీ సీట్లతో డిపార్ట్మెంట్లు వెలవెలబోతుంటే విశ్వవిద్యాలయం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. ఇంజినీరింగ్, బీఫార్మసీ, ఎం.ఫార్మసీ కోర్సుల్లో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించినట్లుగానే మిగిలిపోయిన లా, వివిధ పీజీ కోర్సుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి వెంటనే స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని హెచ్చరించారు. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు వెనుకాడబోమని వీసీకి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ జేఏసీ నాయకులు లింగంపల్లి మహేష్, పీడీఎస్‌యూ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బత్తుల రాజు, చొప్పదండి యోగి, శివాజీ, తెలంగాణ రక్షణ సేన పార్టీ కరీంనగర్ టౌన్ అధ్యక్షుడు లక్ష్మణ్, సతీష్, నరేష్, రాజు, గోపి తదితరులు పాల్గొన్నారు.