పుణ్యక్షేత్రాల దర్శనానికి TGSRTC ప్రత్యేక బస్సుల సౌకర్యం
నారాయణఖేడ్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికుల సౌకర్యార్థం పుణ్యక్షేత్రాల దర్శనానికి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కల్పిస్తోందని డిఫో మేనేజర్ సుబ్రహ్మణ్యం మంగళవారం తెలిపారు. పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇతర బృందాల కోసం 40 మంది ప్రయాణించే విధంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఈ సౌకర్యం ద్వారా భక్తులు తమకు అనుకూలమైన తేదీలలో, తమకు నచ్చిన పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం కల్పించబడుతుందని అన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కోరారు. మరిన్ని వివరాలు, బస్సు బుకింగ్ కోసం 9959223170,9676667703 ఫోన్ నంబర్స్ ను సంప్రదించా లని తెలిపారు.