క్షీరసాగర మథనంతో కనువిందు చేస్తున్న వినాయక మండపం
53 ఏళ్లుగా పురాణ ఘట్టాలతో ప్రత్యేక అలంకరణలు
గద్వాల టౌన్: గద్వాల పట్టణంలోని శ్రీ పాండురంగ స్వామి ఆలయ(Sri Panduranga Swamy Temple) స్వకులశాలి సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం(Vinayaka Mandapam) పురాణ ఘట్టాల అలంకరణతో ఆకట్టుకుంటోంది. 1973 నుంచి ప్రతి ఏడాది విభిన్న పురాణ ఘట్టాలను మండపంలో ప్రదర్శిస్తూ వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది దేవతలు,దానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించిన క్షీరసాగర మథనం ఘట్టాన్ని వినూత్నంగా రూపొందించారు.
ఈ అలంకరణ చిన్నారులు, యువతతో పాటు భక్తులు, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పురాణాలు, సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. అనంతరం మీడియా ప్రతినిధులను స్వకులశాలి సమాజం అధ్యక్షుడు కాంబ్లే శ్రీనివాస్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవుజి రాఘవేందర్, సాక్రె శ్రీనివాస్, దోత్రే సురేంద్రబాబు, గణప నరేందర్, కాంబ్లే ప్రవీణ్,గచ్చి వీరన్న, దోత్రే ప్రమోద్,సఫారీ అజయ్, సఫారీ సురేష్, జిందే కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.