ప్రభుత్వ పాఠశాలకు పెయింట్ బకెట్లు అందజేత
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మాసానిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలకు 80 లీటర్ల పెయింట్ బకెట్లు మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పేరుపల్లి సాయిబాబా(BRS senior leader Perupalli Saibaba) అందజేసినట్లు మాసాని పల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ(BRS Party) అధ్యక్షులు బొల్లారం రాజు తెలిపారు. మాసానీపల్లి ప్రభుత్వ పాఠశాల పెయింట్ పొచ్చలు ఊడిపోయి అద్వానంగా ఉండడంతో గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం రాజు మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పేరుపల్లి సాయిబాబా దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సుమారు పదివేల విలువగల 8 లీటర్ల పెయింట్ బకెట్లు అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయని అందించినందుకు గ్రామ ప్రజల తరఫున,పాఠశాల తరఫున గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం రాజు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ బిఆర్ఎస్ పార్టీ యువకులు సందీప్ కుమార్,గంగయ్య ఉన్నారు.