ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది
మోడీ హటావో దేశ్ బచావో
ఎల్లారెడ్డిలో భారీ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే మదన్మోహన్
ఎల్లారెడ్డి అక్టోబర్ 6 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా గాంధీ చౌక్ వరకు ఎమ్మెల్యే మదన్మోహన్(MLA Madanmohan), జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
భారీ ర్యాలీ అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే మదన్మోహన్ మాట్లాడుతూ, ఎస్ ఐ ఆర్ ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తీవ్ర ఆందోళన చేస్తున్నారని అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడే హక్కు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఓటర్ జాబితాతో పారదర్శకతను నిర్ధారించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసి దిష్టిబొమ్మను తగలబెట్టారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.